నెమలి పత్రిక

నమస్కారం,

నెమలి పత్రిక రెండు కలలుతో మొదలైంది. తెలుగు పుస్తకాలు, కథలు, మరియు కవితలు మరోసారి తెలుగు ఇళ్లలో చదువుతారు మా మొదటి కల. రోజు రోజు కి, ఒకప్పుడు ఉన్న సాహిత్య సంప్రదాయం తగ్గిపోతోంది. ఈ పత్రిక ద్వారా, మన వాళ్లు తెలుగులో రాయడము మరియు చదవడము నెమ్మదిగా పెంచుకుంటారని మా కల. ముఖ్యంగా, ఈ అలవాటు చిన్నవాళ్లలో ఇంకా మా లాగ భారతదేశం బయట పుట్టిన వాళ్లకి పెంచాలని మా కోరిక. ఈ కథలు మరియు కవితలు ఈ పత్రికలో మొదటి భాగము.

మా రెండో కల ఏమో తెలుగు సంప్రదాయాలులో మరియు మన సమాజములో ఏమి తప్పుగా చేస్తున్నామో మరియు ఏమి సరిగా చేస్తున్నామో గురించి ఆలోచన మరియు సంభాషణ పెంచడము. ఈ లాంటి ఆలోచనలు ఈ పత్రిక డి రెండో భాగములో ఉంటయి. దీనితో పాటు, ఈ భాగంలో తెలుగు వాళ్లు చేసిన ఏదైనా కళలు (సాహిత్య కళలు, చిత్రరూప కళలు, సినిమా కళలు, సంగీత రూప కళలు) గురించి విమర్శలు మరియు ఆలోచనలు ఉంటాయి.

పెరిగిన కొద్దీ, పుస్తకాలూ మరియు నవలలు ప్రచురణ మొదలుపెట్టడం మరియు ఈ పత్రికలు కాగితము రూపంలో తయారుచేసి అమ్మడం, మా ఉద్దేశం. ఇప్పటికి, ఈ పత్రిక పూర్తిగా ఉచితము. దాని వల్ల, ఈ పత్రికకు కి రాసిన వాళ్లకు మేము జీతం ఇవ్వలేము. ఈ ప్రయత్నానికి ఎలాగైనా మీకు సహాయము చేయాలనీ ఉంటే,nemalimagazine@proton.me కి ఒక ఉత్తరము పనిపించండి. ఈ పత్రికకు ఏదైనా రాయాలని కోరుకుంటుంటే, మా సమర్పణ పేజీ చదవండి.

నెమలి పత్రిక

english